మాక్స్‌వెల్‌కు మాన‌సిక స‌మ‌స్య‌లు...

Thu,October 31, 2019 01:11 PM

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియా క్రికెట‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్‌.. మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో అత‌ను కొన్ని రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. మాక్స్‌వెల్ స్థానంలో టీ20 జ‌ట్టులోకి డార్సీ షార్ట్‌ను తీసుకున్నారు. త‌న‌కు మాన‌సిక స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు మాక్స్‌వెల్ టీమ్ స‌పోర్ట్ స్టాఫ్‌కు చెప్పాడు. ఆసీస్ బోర్డుకు కూడా ఈ విష‌యాన్ని క్రికెట‌ర్ విన్న‌వించిన‌ట్లు తెలుస్తోంది. అయితే మాక్స్‌వెల్‌కు అండ‌గా ఉండాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు బోర్డు పేర్కొన్న‌ది. జాతీయ జ‌ట్టు సైకాల‌జిస్ట్ డాక్ట‌ర్ మైఖేల్ లాయిడ్ కూడా దీనిపై స్పందించారు. మాన‌సిక స‌మ‌స్య‌ల వ‌ల్ల కొంత కాలం మాక్స్‌వెల్ క్రికెట్‌కు దూరంగా ఉండ‌నున్న‌ట్లు చెప్పారు. త‌న స‌మ‌స్య‌ల‌ను గుర్తించిన మాక్స్‌వెల్‌.. వాటి ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని తెలిపారు. కొన్ని రోజుల క్రిత‌మే శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో.. కేవ‌లం 28 బంతుల్లో మాక్స్‌వెల్ 62 ర‌న్స్ చేశాడు. రెండో మ్యాచ్‌లో అత‌నికి బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాలేదు.1246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles