భారత్‌పై ఆస్ట్రేలియా విజయం

Tue,October 10, 2017 10:21 PM

గువాహటి: భారత్-ఆస్ట్రేలియా మధ్య గువాహటి వేదికగా మంగళవారం జరిగిన టీ 20 రెండవ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలుపొందింది. 119 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 15.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 122 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టీ-20 సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచినైట్లెంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లలో ఎంసీ హెన్రిక్స్ అత్యధికంగా 62 పరుగులు( 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), టీఎం హెడ్ 48 పరుగులు(34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్‌గా నిలవగా ఏజే పించ్ 8 పరుగులు, డీఏ వార్నర్ 2 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బుమ్రా చెరో వికెట్ తీశారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ వేదికగా చివరి టీ-20 మ్యాచ్ జరగనుంది.

రెండవ టీ 20 మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫిల్డింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన టీంమిండియా బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ- 8( నాలుగు బంతుల్లో 2 ఫోర్లు), శిఖర్ ధావన్(ఆరు బంతుల్లో 2 పరుగులు), మనీశ్‌పాండే(ఏడు బంతుల్లో 6 పరుగులు), కేఎం జాదవ్(27 బంతుల్లో 27 పరుగులు), ఎంఎస్ ధోని(16 బంతుల్లో 13 పరుగులు), హెచ్‌హెచ్ పాండ్యా(23 బంతుల్లో 25 పరుగులు), భువనేశ్వర్ కుమార్(ఆరు బంతుల్లో 1 పరుగు), జేజే బుమ్రా(తొమ్మిది బంతుల్లో 7 పరుగులు), కుల్‌దీప్ యాదవ్(19 బంతుల్లో 16 పరుగులు), వైఎస్ చాహాల్- 3 పరుగులతో నాటౌట్‌గా నిలవగా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులేమి చేయకుండానే క్యాచ్ ఔటైయ్యాడు.

2868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles