కాసేప‌ట్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఢీ

Wed,June 12, 2019 02:16 PM

Australia vs Pakistan world cup match to start soon

టాంటన్ : ప్రపంచకప్‌లో అతిథ్య ఇంగ్లండ్‌ను ఖంగు తినిపించి మంచి ఊపుమీద ఉన్న పాకిస్థాన్... డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా తో కాసేప‌ట్లో తలపడనుంది. ఇండియ‌న్ టైమ్ ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌పై తడబడ్డా.. ఆ తర్వాత ఇంగ్లిష్ జట్టుపై గెలిచి పాక్ ఆత్మ విశ్వాసంతో ఉంది. శ్రీలంకతో మ్యాచ్ రద్దు కారణంగా పాక్ ఖాతాలో మూడు పాయింట్లు ఉన్నాయి. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా టోర్నీని ఘనంగా ఆరంభించినా.. భారత్ చేతిలో పరాజయంతో కాస్త నిరాశలో ఉంది. మరి టాంటన్ వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి ఆసీస్ మళ్లీ గెలుపుబాట పడుతుందేమో చూడాలి.

బ్యాటింగే బలం
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ రెండు జట్లకు ప్రధాన బలం బ్యాటింగే. ఆసీస్ బ్యాట్స్‌మెన్ వార్నర్, స్మిత్.. ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో మినహా రెండింటిలోనూ అర్ధశతకాలు చేసి జోరుమీదున్నారు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 92 పరుగులతో గెలుపులో కౌల్టర్‌నైల్ కీలకపాత్ర పోషించాడు. అయితే, గాయపడ్డ స్టాయినిస్ స్థానంలో ఈ మ్యాచ్‌కు షాన్ మార్ష్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ముఖాముఖి
ఆడిన మ్యాచ్‌లు - 9
ఆస్ట్రేలియా గెలిచినవి - 5
పాకిస్థాన్ గెలిచినవి - 4
808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles