హెచ్‌సీఏ అధ్యక్ష పోటీలో అజహర్‌..

Thu,September 19, 2019 03:56 PM

హైదరాబాద్‌: త్వరలో జరగనున్న హెచ్‌సీఏ(హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌) ఎన్నికల బరిలో ఇండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ నిలవనున్నారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. అధ్యక్ష బరిలో అజహర్‌ నిలిచారు. ఆయన నిన్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలు అందజేశారు.


ఈ సందర్భంగా అజహర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ క్రికెట్‌కు పునర్వైభవం తెచ్చేందుకు కృషి చేస్తాననీ, జిల్లా స్థాయిలోనే చాలా టాలెంటెడ్‌ క్రికెటర్స్‌ ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి దాదాపు 7-8 మంది క్రికెటర్స్‌ దేశం తరఫున ప్రాతినిథ్యం వహించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జింఖానా గ్రౌండ్‌లో క్రికెట్‌ను పునరుద్దరించాలి. మేము జింఖానాలోనే చాలా క్రికెట్‌ ఆడామనీ, నేడు ఆ మైదానంలోకి క్రికెటర్లను రానివ్వకపోవడం భాదాకరం. ఈ మైదానాన్ని పునరుద్దరించి క్రికెట్‌ ఆడేలా చూస్తామన్నారు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం అందుబాటులోకి వచ్చిన నుంచి ఎల్‌బీ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించడం లేదు. ఈ ప్రఖ్యాత మైదానంలో ఎన్నో గొప్ప మ్యాచ్‌లు జరిగాయి. ఇపుడు రాజకీయ మీటింగులకు అడ్డాగా మారిందని, ఎల్‌బీ స్టేడియంలో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేలా చూస్తానని ఆయన అన్నారు.

కింది స్థాయి నుంచే క్రికెటర్లను తీర్చిదిద్దాలనీ, వారికి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా ఆయన అన్నారు. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన విజయవంతమైన కెప్టెన్‌లలో అజహర్‌ కూడా ఉంటాడనడంలో సందేహం లేదు. ఈ ఎన్నికల్లో అజహర్‌తో పాటు మరో తొమ్మిది మంది వివిధ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు.

942
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles