హెల్మెట్‌లో చిక్కిన బంతి.. ఆట‌ప‌ట్టించిన బ్యాట్స్‌మెన్‌

Fri,August 16, 2019 12:59 PM

హైద‌రాబాద్‌: శ్రీలంక‌లోని గాలెలో కివీస్‌తో జ‌రుగుతున్న‌తొలి టెస్టులో ఓ ఫ‌న్నీ మూమెంట్ చోటుచేసుకున్న‌ది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ట్రెంట్ బౌల్ట్ హెల్మెట్‌లో బంతి చిక్కుకోవ‌డంతో.. ఇన్నింగ్స్ 82వ ఓవ‌ర్‌లో కాసేపు స‌ర‌దా స‌న్నివేశం చోటుచేసుకున్న‌ది. స్పిన్న‌ర్ ల‌సిత్ ఎంబుల్డేనియా వేసిన బంతిని బౌల్ట్ స్వీప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే హెడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వెళ్లి బౌల్ట్ హెల్మెట్ ముందుభాగంలో చిక్కుకున్న‌ది. అయితే బౌల్ట్‌ను చుట్టి ఉన్న ఫీల్డ‌ర్లు ఆ బంతిని అందుకునే ప్ర‌య‌త్నం చేశారు. కీప‌ర్‌తో స‌హా స్లిప్స్‌, షార్ట్‌లెగ్‌లో ఉన్న ఫీల్డ‌ర్లు హెల్మెట్‌లో చిక్కుకున్న బంతిని అందుకునేందుకు ఆరాట‌ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో బౌల్ట్ వారి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఫీల్డ‌ర్ల‌ను ఆట‌ప‌ట్టించాడు. దీంతో కాసేపు మైదానంలో న‌వ్వులు పూశాయి. కామెంటేట‌ర్లు, ప్రేక్ష‌కులు కూడా ఆ స‌న్నివేశాన్ని తెగ ఎంజాయ్ చేశారు. బౌల్ట్ 18 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు.



1957
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles