తొలిటెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా

Thu,November 14, 2019 09:19 AM

ఇండోర్: భారత్, బంగ్లా మధ్య జరుగనున్న తొలిటెస్టులో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ మొమినుల్ హక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా బంగ్లా కెప్టెన్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలని టీమ్ యాజమాన్యం అంతా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని అతను తెలిపాడు. ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కొనేందుకు సన్నద్దమయ్యామని మొమినుల్ తెలిపాడు. మైదానంలో కాస్త తేమ ఉండడంతో మొదటి రెండు గంటలు బౌలర్లకు ఇబ్బంది కలగవచ్చు. కాగా, బంగ్లా కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. షకీబ్ నిషేదానికి గురైన విషయం తెలిసిందే. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సైతం గాయం కారణంగా కీలక సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో, బంగ్లా బ్యాటింగ్ విభాగం కాస్త కలవరపడుతోందని చెప్పొచ్చు. భీకర ఫామ్‌లో ఉన్న భారత పేస్ దళాన్ని బంగ్లా బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.

708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles