టీమిండియా హెడ్‌కోచ్‌ను ఎంపిక చేసేదీ వీళ్లే..

Fri,July 26, 2019 05:19 PM

ముంబై: భారత పురుషుల‌ క్రికెట్‌ జట్టు ప్ర‌ధాన‌ కోచ్‌ను ఎంపిక చేసే కొత్త ప్యానెల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. మాజీ క్రికెట‌ర్లు క‌పిల్ దేవ్‌, అంశుమ‌న్ గైక్వాడ్‌, శాంతా రంగ‌స్వామిల‌తో కూడిన క్రికెట్ స‌ల‌హా క‌మిటీని ఏర్పాటు చేశారు. ప్ర‌ధాన కోచ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను స‌ల‌హా క‌మిటీ ఇంట‌ర్వ్యూ చేయ‌నుంది. ప్రధాన కోచ్‌తో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ పదవుల కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించి, తుదిగడువును ఈ నెల 30గా నిర్ణయించిన విషయం తెలిసిందే.


మాజీ క్రికెట‌ర్లు మ‌హేల జ‌య‌వ‌ర్ద‌నేతో పాటు గ్యారీ కిర్‌స్టన్‌, టామ్‌ మూడీ టీమిండియా కోచ్‌ పదవికి పోటీప‌డుతున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు టీమ్‌ఇండియా ఫీల్డింగ్ కోచ్ స్థానం కోసం ఆల్‌టైం ఫీల్డింగ్ గ్రేట్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ దరఖాస్తు చేసుకున్నాడు.

1873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles