ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. ఫస్ట్ మ్యాచ్‌లోనే ధోనీ vs కోహ్లి

Tue,February 19, 2019 03:04 PM

BCCI released first two weeks schedule of IPL 2019

ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2019 షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. అయితే 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మొదటి మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లి కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేసింది. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ అధికారిక ట్విట‌ర్‌లో ఉంచారు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 24న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడ‌నుంది. ఇక హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో మార్చి 29న ఈ సీజ‌న్ తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రాజ‌స్థాన్‌తో స‌న్‌రైజ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది.


4612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles