కోహ్లీసేన‌తో తలపడే ఇంగ్లాండ్ జట్టిదే..

Fri,June 29, 2018 05:51 PM

లండన్: సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో భారత్‌తో తలపడే ఇంగ్లాండ్ జట్టును ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తాజాగా ప్రకటించింది. తొడ కండరాల గాయం కారణంగా ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ 5-0తో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసిన విషయం తెలిసిందే. స్టోక్స్ రాకతో ఇంగ్లీష్ జట్టుకు మరింత బలం చేకూరనుంది.

ఒకవేళ స్టోక్స్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే భారత్‌తో జులై 8న బ్రిస్టోల్‌లో జరగనున్న మూడో టీ20కి ఇంగ్లాండ్ టీమ్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని ఈసీబీ పేర్కొంది. గాయం నుంచి కోలుకుంటున్న క్రిస్‌వోక్స్ సైతం ఫిట్‌నెస్ సాధించినైట్లెతే ఆఖరి వన్డేలకు జట్టులో చేరే అవకాశం ఉందని బోర్డు వెల్లడించింది.

జట్టు:

ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, జేక్ బాల్, జోస్ బట్లర్, టామ్ కర్రన్, అలెక్స్ హేల్స్, లియామ్ ఫ్లంకెట్, అడిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్

మ్యాచ్ షెడ్యూల్:

తొలి వన్డే జులై 12
రెండో వన్డే జులై 14
మూడో వన్డే జులై 17

4548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles