ఇంగ్లండ్ క్రికెటర్ గూండాయిజం.. వీడియో

Thu,September 28, 2017 12:16 PM

లండన్: ఇంగ్లండ్ టీమ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులను కొట్టాడన్న కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చాడు స్టోక్స్. అయితే తాజాగా సన్ న్యూస్‌పేపర్ ఆ గొడవకు సంబంధించిన వీడియోను కూడా బయటపెట్టింది. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేకు అతన్ని పక్కన పెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్.. ఇప్పుడు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు కూడా అతన్ని పక్కన పెట్టే ఆలోచనలో ఉంది. బుధవారం ఎంపిక చేసిన టీమ్‌లో స్టోక్స్ ఉన్నాడు. నిజానికి అతను వైస్‌కెప్టెన్. అయితే ఈ వీడియో బయటకు రావడంతో టీమ్ మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడింది. ఈ గొడవలో స్టోక్స్‌పై కేసు నమోదు కాకపోయినా.. విచారణ మాత్రం కొనసాగుతున్నది. హిట్ ఫర్ సిక్స్ పేరుతో స్టోక్స్ గొడవ వీడియోను సన్ బయటపెట్టింది. అందులో ఇద్దరు వ్యక్తులపై స్టోక్స్ పిడిగుద్దులు కురిపిస్తుండటం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వీడియోను సన్ బయటపెట్టిన తర్వాతే తాము చూశామని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చెప్పింది. ప్రస్తుతానికి అతను వైస్ కెప్టెన్‌గా ఉన్నాడని, అయితే అది పోలీసులపై అతనిపై ఎలాంటి చర్య తీసుకోనంత వరకే అని ఈసీబీ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ స్పష్టంచేశాడు. ఈ గొడవ సమయంలో స్టోక్స్ పక్కనే ఉన్న అలెక్స్ హేల్స్‌ను యాషెస్‌కు ఎంపిక చేయలేదు ఇంగ్లండ్.


3408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles