బెన్ స్టోక్స్‌కు అవార్డు ఇవ్వ‌నున్న న్యూజిలాండ్ !

Fri,July 19, 2019 12:05 PM

హైద‌రాబాద్‌: న్యూజిలాండ్‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్ ద‌క్క‌కుండా అడ్డుప‌డింది బెన్ స్టోక్స్‌. ఫైన‌ల్లో అద్భుతంగా ఆడిన స్టోక్స్‌కు ఇప్పుడు న్యూజిలాండ్ ప్ర‌భుత్వ అవార్డుకు పోటీప‌డుతున్నాడు. న్యూజిలాండ‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు కోసం బెన్ స్టోక్స్‌ను నామినేట్ చేశారు. లార్డ్స్‌లో జ‌రిగిన వ‌న్డే క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో.. బెన్ స్టోక్స్ సూప‌ర్ షోతో ఆక‌ట్టుకున్నాడు. ఫైన‌ల్ ఓవ‌ర్‌లోనూ, ఆ త‌ర్వాత సూప‌ర్ ఓవ‌ర్‌లోనూ కీల‌క ఆట‌గాడిగా నిలిచాడు. కివీస్‌కు క‌న్నీళ్లు మిగిల్చిన స్టోక్స్‌.. ఇప్పుడు ఆ దేశ‌మే అవార్డుకు నామినేట్ చేసింది. వాస్త‌వానికి స్టోక్స్ .. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చ‌ర్చ‌లో పుట్టాడు. అత‌డి త‌ల్లితండ్రులు మ‌వోరి తెగ‌కు చెందిన‌వారు. న్యూజిలాండ‌ర్ ఆఫ్ ఇయ‌ర్ అవార్డు కోసం మొత్తం ప‌ది మందిని ఫైన‌ల్ లిస్టుకు నామినేట్ చేస్తారు. ఆ జాబితా నుంచి విన్న‌ర్‌ను ఎంపిక చేస్తారు. ఆ అవార్డును 2020 ఫిబ్ర‌వ‌రిలో అంద‌జేస్తారు. కివీస్ కెప్ట‌న్ కేన్ విలియ‌మ్‌స‌న్ కూడా ఈ అవార్డుకు పోటీ ప‌డుతున్నారు. 15 ఏళ్లు దాటిన కివీస్ దేశ‌స్థులు ఈ అవార్డుకు పోటీప‌డే అవ‌కాశం ఉంది. బెన్‌ స్టోక్స్‌కు ఇంగ్లండ్ కూడా నైట్‌వుడ్ అవార్డును ఇవ్వాల‌నుకుంటున్న‌ది.

2565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles