బెన్ స్టోక్స్‌ను పక్కన పెట్టేశారు..

Tue,August 14, 2018 09:38 AM

లండన్: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు మళ్లీ జట్టులో చోటు దక్కలేదు. భారత్‌తో జరిగే మూడవ టెస్టుకు అతన్ని ఎంపిక చేయలేదు. టెంట్ బ్రిడ్జ్‌లో జరగనున్న మూడవ టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టు తమ ప్లేయర్లను ప్రకటించింది. ఆ బృందంలో స్టోక్స్‌కు మళ్లీ స్థానం దక్కలేదు. బ్రిస్టల్‌లో ఒకర్ని కొట్టిన కేసులో ప్రస్తుతం స్టోక్స్ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆ కేసులో క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే స్టోక్స్‌ను జట్టుకు ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో ఇంగ్లండ్ బోర్డు ఉంది. తొలి టెస్టులో భారత్‌పై విజయంలో కీలక పాత్ర పోషించి స్టోక్స్ ఆ తర్వాత రెండవ టెస్టుకు ఎంపిక కాలేదు. అతని స్థానంలో వచ్చిన వోక్స్.. రెండవ టెస్టులో అత్యద్భుతంగా రాణించాడు. దీంతో స్టోక్స్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవాలన్న తొందరపాటును ఇంగ్లండ్ బోర్డు ప్రదర్శించడం లేదు. బ్రిస్టల్ దాడి కేసు తేలిన తర్వాతనే అతనిపై బోర్డు దృష్టి పెట్టనున్నది.

1861
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles