స్టోక్స్ ఔట్.. రెండో టెస్ట్‌కు ఇంగ్లండ్ టీమ్ ఇదే

Sun,August 5, 2018 06:01 PM

లండన్: టీమిండియాతో జరగబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ టీమ్‌ను ప్రకటించారు. ఇందులో రెండు మార్పులు చేశారు. తొలి టెస్ట్ ఆడిన డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్‌ల స్థానంలో ఓలీ పోప్, క్రిస్ వోక్స్‌లను తీసుకున్నారు. స్టోక్స్‌కు వచ్చే వారంలో కోర్టు విచారణ ఉండటంతో అతన్ని పక్కనపెట్టారు. ఇక మలాన్ ఫామ్ ఆశించనంతగా లేకపోవడంతో టీమ్‌లో చోటు కోల్పోయాడు. సర్రే టీమ్‌కు ఆడుతున్న ఓలీ పోప్.. ఈ సీజన్‌లో టాప్ ఫామ్‌లో ఉన్నాడు. 85.50 సగటుతో 684 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇండియా ఎ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. లార్డ్స్‌లో రెండో టెస్ట్ జరగనుంది.

ఇంగ్లండ్ టీమ్: జో రూట్, మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్, అలిస్టర్ కుక్, శామ్ కురన్, కీటన్ జెన్నింగ్స్, ఓలీ పోప్, జేమీ పోర్టర్, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్

4082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles