పాక్‌ క్రికెటర్లకు బిర్యాని కట్‌

Tue,September 17, 2019 05:18 PM

ఇస్లామాబాద్‌: ఇటీవలే పాకిస్తాన్‌ క్రికెట్‌కు నూతన కోచ్‌గా నియమితులైన మిస్బా ఉల్‌ హక్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆటగాళ్లు రాణించాలంటే శారీరకంగానూ, మానసికంగానూ దృఢంగా ఉండాలన్నారు. అందుకు గానూ ఆటగాళ్ల మెనూను పూర్తిగా మార్చనున్నట్టు సమాచారం. ఆటగాళ్ల డైట్‌లో ఆయిల్‌ ఫుడ్‌ పూర్తిగా నిషేధించారు. స్వీట్స్‌, బిర్యానీ, పిజ్జా, బర్గర్‌, దున్న మాంసాన్ని తొలగించనున్నారు.


ఇటీవలి కాలంలో పాక్‌ టీ-20ల్లో మినహా మిగితా ఫార్మట్స్‌లో విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లు పూర్తి ఫిట్‌గా మారాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, న్యూట్రిషియన్స్‌ గల ఫుడ్‌ను అందిచాలనుకుంటున్నట్లు కోచ్‌ మిస్బా నిర్ణయించారని పాక్‌ జర్నలిస్ట్‌ సాజ్‌ సాదిక్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

కాగా, మిస్బా ఇటీవలే పాకిస్తాన్‌ క్రికెట్‌ హెడ్‌కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌గా రెండు భాద్యతలు స్వీకరించాడు. ఆయనతో పాటు బౌలింగ్‌ కోచ్‌గా వకార్‌ యూనిస్‌ భాద్యతలు చేపట్టారు. వారు త్వరలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే సిరీస్‌ నుంచి పూర్తి భాద్యతలు నిర్వహిస్తారు.


1771
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles