బౌల‌ర్లు నిల‌క‌డ‌గా రాణిస్తున్నారు: విరాట్ కోహ్లీ

Mon,July 8, 2019 03:59 PM

హైద‌రాబాద్‌: వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మంగ‌ళ‌వారం కివీస్‌తో భార‌త్ తొలి సెమీఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌నున్న‌ది. మాంచెస్ట‌ర్‌లో జ‌రిగే ఆ మ‌హాపోరుకు రెండు జ‌ట్లు రెఢీ అయ్యాయి. ఇవాళ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. రోహిత్ శ‌ర్మ‌లా సెంచ‌రీలు చేయ‌క‌పోవ‌డం త‌న‌నేమీ బాధించ‌డంలేద‌న్నాడు. 2008లో కివీస్‌తో అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్ ఆడిన అంశాన్ని విలియ‌మ్‌స‌న్‌కు గుర్తు చేయ‌నున్న‌ట్లు కోహ్లీ చెప్పాడు. 11 ఏళ్ల త‌ర్వాత ఇద్ద‌ర‌మూ జాతీయ జ‌ట్ల‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నాయ‌క‌త్వం వ‌హించ‌డం గొప్ప‌గా ఉంద‌న్నాడు. కివీస్‌తో పాటు మా జ‌ట్టు నుంచి కూడా అండ‌ర్ 19లో ఆడిన అనేక మంది ప్లేయ‌ర్లు వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడుతున్న‌ట్లు కోహ్లీ చెప్పాడు. ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌ని తాను కానీ, విలియ‌మ్‌స‌న్ కానీ ఊహించ‌లేద‌న్నాడు. ఉత్త‌మ‌ క్రికెట్ ఆడాల‌న్న దానిపై తాము శ్ర‌ద్ధ‌పెట్టిన‌ట్లు కోహ్లీ తెలిపాడు. టీమిండియాకు ధోనీ అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌న్నాడు. టీమిండియా బౌలింగ్ బాగుంద‌ని, బౌల‌ర్లు క్ర‌మంగా రాణిస్తున్నార‌న్నాడు. ప్ర‌తి మ్యాచ్‌లోనూ వ‌త్తిడి ఉంద‌ని, కానీ ఆ ఒత్తిడిని ఎదుర్కొనే విధంగా జ‌ట్టు త‌యార‌వుతుంద‌న్నాడు. జ‌ట్టు కోసం ఎటువంటి పాత్ర పోషించేందుకైనా తాను సిద్ధ‌మే అన్నాడు. ఏ రోజైనా..ఆ రోజు ఉత్త‌మ ఆట ఆడిన జ‌ట్టే గెలుస్తుంద‌ని అన్నాడు. వ‌న్డే క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ టాప్ ప్లేయ‌ర్ అని కోహ్లీ అన్నాడు.

3296
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles