కోహ్లీ, ధోనీపై పాట..ఇంటర్నెట్‌లో వైరల్

Sat,February 9, 2019 06:11 PM

Champion DJ Bravo unveils new song Asia featuring MS Dhoni, Virat Kohli, Shahid Afridi

న్యూఢిల్లీ: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ క్రికెటర్‌గా కొనసాగుతూనే.. అప్పుడప్పుడూ కొత్త పాటలనూ రూపొందిస్తుంటాడు. ఇంతకుముందు బ్రావో రిలీజ్ చేసిన 'ఛాంపియన్' సాంగ్ ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ పొందింది. తాజాగా ఏషియాలో సూపర్ స్టార్ హోదా కలిగిన ఆటగాళ్లతో మరో కొత్త సాంగ్‌ను విడుదల చేశాడు. దీన్ని ఏషియా ఫ్యాన్స్ కోసం అంకితం చేశాడు. తన కొత్త పాటకు 'ఏషియా' అని నామకరణం చేశాడు.

న్యూ సాంగ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీతో పాటు పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ క‌నిపిస్తారు. భారత ఉపఖండంలో పేరొందిన బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్, అఫ్గనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్, శ్రీలంక దిగ్గజ క్రికెటర్లు మహేల జయవర్దనే, కుమార సంగక్కరల‌ను పాటలో చేర్చాడు. పాటనను అఫ్రిదీ ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ఛాంపియన్ పాటకన్నా ఏషియా సాంగ్ బాగుందని వ్యాఖ్యానించాడు. ఈ సాంగ్ క్రికెట్ అభిమానుల‌ను ఎంత‌గానే అల‌రిస్తోంది.4493
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles