చెన్నై, ముంబై మ్యాచ్ అంటే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లాంటిది!

Wed,April 3, 2019 05:00 PM

Chennai and Mumbai match like India and Pakistan fixture says Harbhajan Singh

ముంబై: ఐపీఎల్‌లో మరో హైవోల్టేజ్ మ్యాచ్‌కు టైమ్ దగ్గర పడింది. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఓటమెరగని టీమ్ చెన్నైని సొంతగడ్డపై ఓడించడానికి తహతహలాడుతున్నది ముంబై టీమ్. అయితే పదేళ్ల పాటు ఈ ముంబై టీమ్‌కు ఆడి గత సీజన్‌లోనే చెన్నై వైపు వెళ్లిన హర్భజన్ ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌పై స్పందించాడు. అసలు ముంబై, చెన్నై మ్యాచ్ ఎప్పుడు జరిగినా.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లాగే అనిపిస్తుందని భజ్జీ అన్నాడు. ముంబై తరఫున ఆడే సమయంలో చెన్నైని ఓడించాలని అనుకునేవాళ్లమని, చెన్నై కూడా ముంబై గెలవడానికి ప్రయత్నించేదని అతను చెప్పాడు. కానీ ఇప్పుడు చెన్నై టీమ్ తరఫున ఆడుతూ.. ముంబైని ఓడించాలని అనుకోవడం వింతగా ఉందని హర్భజన్ అన్నాడు. 2017 సీజన్ తర్వాత భజ్జీని ముంబై టీమ్ వదులుకోగా.. 2018 వేలంలో రూ.2 కోట్లకు అతన్ని చెన్నై టీమ్ కొనుగోలు చేసింది. ముంబై, చెన్నై మధ్య 24 మ్యాచ్‌లు జరగగా.. అందులో 13సార్లు ముంబై, 11 సార్లు చెన్నై గెలిచింది. చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు ముంబై గెలిచినవే కావడం విశేషం.
3121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles