చెన్నై హ్యాట్రిక్

Mon,April 1, 2019 01:17 AM

-ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్
-సమిష్టి ప్రదర్శనతో విజృంభణ
-రాజస్థాన్‌పై కింగ్స్‌దే విజయం

చెన్నై: ఐపీఎల్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. సొంత ఇలాఖాలో తమకు తిరుగులేదన్న రీతిలో ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా చెన్నై సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతున్నది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 పరుగుల తేడాతో విజయం సాధించి హ్యాట్రిక్ అందుకుంది. చెన్నై నిర్దేశించిన 176 పరుగు ల లక్ష్యఛేదనలో రాయల్స్ 167/ 8 స్కోరు చేసింది. త్రిపాఠి(39), స్టోక్స్(46) రాణించగా, ఆఖర్లో ఆర్చర్ (24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. చాహర్(2/19), శార్దుల్ (2/42), తాహిర్(2/ 23), బ్రావో(2/32) రాణించారు. తొలుత ధోనీ(46 బంతుల్లో 75, 4ఫోర్లు, 4సిక్స్‌లు), రైనా(36) రాణింపు తో చెన్నై 20 ఓవర్లలో 175/5 స్కోరు చేసింది. ఆర్చర్(2/17) 2వికెట్లు తీశాడు.

రాయల్స్ బేజారు!: లక్ష్యఛేదనలో రాయల్స్‌కు ఆదిలోనే కెప్టెన్ రహానే(0) రూపం లో ఎదురుదెబ్బ తగిలింది. చాహర్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన రహానే.. జడేజాకు క్యాచ్ ఔటయ్యాడు. పరుగుల ఖాతా తెరువకముందే రాయల్స్ వికెట్ కోల్పోయింది. రెండు బంతుల తేడాతో శాంసన్(8), బట్లర్(6) పెవిలియన్ చేరడంతో రాయల్స్ ఒక్కసారిగా కుదేలైంది. ఈ తరుణంలో రాహుల్ త్రిపాఠి(39), స్మిత్(28) ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయ త్నం చేశారు. వీరిద్దరు చెన్నై బౌలింగ్‌ను సమయోచితంగా ఎదుర్కొన్నారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ లక్ష్యాన్ని కుదించే ప్రయత్నం చేశారు. మ్యాచ్‌పై పట్టు సాధించారనుకున్న క్రమంలోనే త్రిపాఠిని తాహిర్ ఔట్ చేసి చెన్నైని పోటీలోకి తీసుకొచ్చాడు. అయితే ఆఖర్లో స్టోక్స్, ఆర్చర్ పోరాడినా రాజస్థాన్ విజయాన్నందుకోలేకపోయింది.

ధోనీ విజృంభణ:

తేమ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్ కెప్టెన్ రహానే.. టాస్ గెలువగానే చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆర్చర్ తన రెండో ఓవర్లో ఓపెనర్ రాయుడు(1)ను ఔట్ చేశాడు. వాట్సన్..స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వచ్చి రావడంతోనే వరుసగా రెండు ఫోర్లు బాది ఊపుమీద కనిపించిన జాదవ్ కూడా కులకర్ణి బౌలింగ్‌లో నిష్క్రమించా డు. పవర్ ప్లే ముగిసే సరికి చెన్నై మూడు కీలక వికెట్లు కోల్పోయి 29 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో కెప్టెన్ ధోనీ, రైనా ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. గోపాల్ 11వ ఓవర్లో సిక్స్‌తో రైనా ఊపులోకొచ్చాడు. అయితే ఉనద్కత్ బౌలింగ్‌లో తడబడ్డ రైనా క్లీన్‌బౌల్డ్ కావడంతో నాలుగో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ధోనీకి బ్రావో జతకలిశాడు. వీరిద్దరు తమ అనుభవాన్నంతా జోడిస్తూ విజృంభించడంతో చివరి 18 బంతుల్లో చెన్నై 60 పరుగులు దక్కాయి.

స్కోరుబోర్డు:

చెన్నై: రాయుడు(సి)బట్లర్(బి)ఆర్చర్ 1, వాట్సన్(సి)ఆర్చర్(బి)స్టోక్స్ 13, రైనా(బి)ఉనద్కత్ 36, జాదవ్(సి) బట్లర్(బి)కులకర్ణి 8, ధోనీ 75 నాటౌట్, బ్రావో(సి) కులకర్ణి(బి)ఆర్చర్ 27, జడేజా 8 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 175/5; వికెట్ల పతనం: 1-1, 2-14, 3-27, 4-88, 5-144; బౌలింగ్: కులకర్ణి 4-0-37-1, ఆర్చర్ 4-1-17-2, స్టోక్స్ 3-0-30-1, గోపాల్ 3-0-23-0, గౌతమ్ 2-0-13-0, ఉనద్కత్ 4-0-54-1.

రాజస్థాన్: రహానే(సి)జడేజా(బి) చాహర్ 0, బట్లర్(సి)బట్లర్(బి)శార్దుల్ 6, శాంసన్(సి)రైనా(బి)చాహర్ 8, త్రిపాఠి (సి&బి) తాహిర్ 39, స్మిత్ (సి)సబ్/షోరె(బి) తాహిర్ 28, స్టోక్స్ (సి)రైనా(బి)బ్రావో 46, గౌతమ్ (సి)రైనా(బి) శార్దుల్ 9, ఆర్చర్ 23 నాటౌట్, గోపాల్ (సి)తాహిర్(బి)బ్రావో 0, ఉనద్కత్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 167/8; వికెట్ల పతనం: 1-0, 2-14, 3-14, 4-75, 5-94, 6-120, 7-164, 8-166; బౌలింగ్: చాహర్ 4-1-19-2, శార్దుల్ 4-0-42-2, సాంట్నర్ 2-0-26-0, జడేజా 2-0-23-0, తాహిర్ 4-0-23-2, బ్రావో 4-0-32-2.

3369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles