తొలి మ్యాచ్ ఆదాయం పుల్వామా అమరవీరుల కుటుంబాలకు..

Thu,March 21, 2019 05:11 PM

Chennai Super kings first home match proceeds will be donated to Pulwama Martyrs families

చెన్నై: ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 12వ సీజన్‌లో భాగంగా సొంతగడ్డపై జరిగే తొలి మ్యాచ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పుల్వామా అమరవీరుల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ చెక్కును టీమ్ కెప్టెన్ ధోనీ వారికి అందజేయనున్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నై, బెంగళూరు మధ్య ఈ నెల 23న జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఇందులో టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమంతా పుల్వామా అమరవీరుల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు సీఎస్‌కే టీమ్ డైరెక్టర్ రాకేష్ సింగ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకం ప్రారంభించిగా.. కొన్ని గంటల్లోనే హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి.2080
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles