పీవీ సింధుకు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్

Sun,August 25, 2019 07:44 PM

Congratulatory wishes pour in for PV Sindhu after her historic win

హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత షట్లర్‌గా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సింధు 21-7, 21-7 తేడాతో వరుస గేముల్లో జపాన్‌ క్రీడాకారిణి, 2017 చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఒకుహరను చిత్తుచేసింది. ఈ సందర్భంగా క్రీడా, రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ గవర్నర్ నరసింహన్, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్,టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు, తదితరులు అభినందనలు తెలియజేశారు. ఆమె సాధించిన విజయాన్ని చూసి భారత్ గర్విస్తోందని.. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అంకితభావం, పట్టుదలతో విజయం సాధించి స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని మోదీ కొనియాడారు. పీవీ సింధు అద్భుత విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సింధు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
1706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles