కోహ్లి, ధోనీ ఒక్కో ప‌రుగుకు ఎంత సంపాదించారో తెలుసా?

Thu,May 25, 2017 11:15 AM

ముంబై: ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో టీమిండియా టాప్ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లి, ఎమ్మెస్ ధోనీ పెద్ద‌గా రాణించింది లేదు. కానీ ఈ మెగా లీగ్ ద్వారా డ‌బ్బు మాత్రం బాగానే సంపాదించారు. అదే స‌య‌మంలో గౌత‌మ్ గంభీర్‌, శిఖ‌ర్ ధావ‌న్ మాత్రం తీసుకున్న డ‌బ్బుకు కాస్త న్యాయం చేశారు. ఒక్కో క్రికెట‌ర్ అందుకున్న మొత్తం.. చేసిన ప‌రుగుల ఆధారంగా ఒక్కో ప‌రుగుకు ఎంత సంపాదించారో బిజినెస్ టుడే ఓ లెక్క గ‌ట్టింది. ఆ లెక్క‌న ఈ సీజ‌న్‌లో పెద్ద‌గా రాణించ‌ని కోహ్లి, ధోనీలు ఒక్కో ప‌రుగుకు రూ.4 ల‌క్ష‌ల‌కుపైగా అందుకోవ‌డం విశేషం. ఇక పుణె సూప‌ర్‌జెయింట్ మిలియ‌న్ డాల‌ర్ మ్యాన్ బెన్ స్టోక్స్ కూడా ఒక్కో ప‌రుగుకు 4 ల‌క్ష‌ల‌కుపైగా సంపాదించాడు.


ఒక్కో ప‌రుగుకు ఏ క్రికెట‌ర్ ఎంత అందుకున్నాడంటే..

విరాట్ కోహ్లి: రూ. 15 కోట్లు.. ప‌ది ఇన్నింగ్స్‌లో 305 రన్స్ = ఒక్కో ర‌న్‌కు రూ.4,87,012
ఎమ్మెస్ ధోనీ: రూ.12.5 కోట్లు.. 16 ఇన్నింగ్స్‌లో 290 ర‌న్స్‌= ఒక్కో ర‌న్‌కు రూ.4,31,034
బెన్ స్టోక్స్‌: రూ.14.5 కోట్లు.. 12 ఇన్నింగ్స్‌లో 316 ర‌న్స్‌= ఒక్కో ర‌న్‌కు రూ.4,58,860
ఏబీ డివిలియ‌ర్స్‌: రూ.9.5 కోట్లు.. 9 ఇన్నింగ్స్‌లో 219 ర‌న్స్‌= ఒక్కో ర‌న్‌కు రూ.4,39,814
గౌత‌మ్ గంభీర్‌: రూ. 10 కోట్లు.. 16 ఇన్నింగ్స్‌లో 498 ర‌న్స్‌= ఒక్కో ర‌న్‌కు రూ.2,00,803
సురైశ్ రైనా: రూ.9.5 కోట్లు.. 14 ఇన్నింగ్స్‌లో 442 ర‌న్స్‌= ఒక్కో ర‌న్‌కు రూ.2,14,932
శిఖ‌ర్ ధావ‌న్‌: రూ.12.5 కోట్లు.. 14 ఇన్నింగ్స్‌లో 479 ర‌న్స్‌= ఒక్కో ర‌న్‌కు రూ.2,60,960

2179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles