మళ్లీ ఇంటికెళ్లిపోతావా.. జాదవ్‌తో ఆడుకున్న ధోనీ.. వైరల్ వీడియో

Mon,March 25, 2019 03:09 PM

CSK captain MS Dhoni trolls Kedhar Jadhav at Airport in this viral video

చెన్నై: కెప్టెన్‌గా ఫీల్డ్‌లో ధోనీ ఎంత కామ్‌గా, కూల్‌గా ఉంటాడో.. మ్యాచ్ తర్వాత టీమ్ మేట్స్‌తో అతను అంత సరదాగా ఉంటాడు. టీమ్‌లో సీనియర్ మోస్ట్ ప్లేయర్ అయినా కూడా తన కంటే జూనియర్ ప్లేయర్స్‌ను ఆట పట్టిస్తాడు. తాజాగా చెన్నై, బెంగళూరు మ్యాచ్ తర్వాత కూడా తన టీమ్ ప్లేయర్ కేదార్ జాదవ్‌ను ఆట పట్టించాడు ధోనీ. ఎయిర్‌పోర్ట్‌లో ఈ సరదా ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచిన సమయంలో కేదార్ జాదవ్ క్రీజులో ఉన్నాడు. ఈ విజయం నీకెలా అనిపిస్తోందంటూ టీమ్ మేట్ మోహిత్ చౌహాన్ .. జాదవ్‌ను ప్రశ్నించాడు. దీనిపై అతడు స్పందిస్తూ.. చాలా సంతోషంగా ఉంది. గతేడాది ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనూ ముంబైపై గెలిచినప్పుడు నేనే క్రీజులో ఉన్నాను. ఇప్పుడూ అదే జరిగింది అని చెబుతూ పోయాడు. మధ్యలో జోక్యం చేసుకున్న ధోనీ.. మరి ఈసారీ ఇంటికెళ్లిపోతావా అంటూ ప్రశ్నించాడు. ధోనీ ఇలా అడగటానికి కారణం లేకపోలేదు. గతేడాది ఆ మ్యాచ్ తర్వాత గాయంతో కేదార్ జాదవ్ సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. దీంతో ఈసారీ అలాగే చేస్తావా అంటూ ధోనీ సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో పక్కనే ఉన్న టీమ్ మేట్స్ అంతా పెద్దగా నవ్వారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

5153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles