వార్నర్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడితే.. గెలుపు తథ్యం: కోచ్‌ లాంగర్‌

Thu,September 12, 2019 03:17 PM

David Warner's

ఓవల్‌: ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఓ మంచి ఇన్నింగ్స్‌ ఆడితే ఆసీస్‌ గెలుపు సులువవుతుందని ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అన్నారు. ఈ సిరీస్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడి ఒకే అర్ధసెంచరీ చేసిన డేవిడ్‌ వరుసగా విఫలమౌతున్నాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌ తరచూ ఔటవుతున్నాడు. ఈ సిరీస్‌లో బ్రాడ్‌ వార్నర్‌ను ఐదు సార్లు ఔట్‌ చేశాడు.

ఈ సందర్భంగా ఆసీస్‌ కోచ్‌ మీడియాతో మాట్లాడుతూ.. మాకు తెలుసు వార్నర్‌ ఎలాంటి ఆటగాడో. అతను కొత్తగా నిరూపించుకోవడానికి ఏమి లేదు. అతడు వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్‌. కానీ, ఈ సిరీస్‌లో రాణించడానికి వార్నర్‌కు ఓవల్‌ టెస్టు మంచి అవకాశం. అతడి నుంచి ఓ భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నాం. అతడు విజయవంతమైతే ఆసీస్‌కు తిరుగుండదు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం, నిషేధం అనంతరం వార్నర్‌ ఐపీఎల్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలువగా, వరల్డ్‌ కప్‌లోనూ మంచి ఇన్నింగ్స్‌ ఆడిన విషయం తెలిసిందే.

492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles