ఒలంపిక్ బెర్త్ సాధించిన దీపక్ పూనియా

Sat,September 21, 2019 06:01 PM

నూర్-సుల్తాన్: కజకిస్తాన్‌లో జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ దీపక్ పూనియా సెమీ ఫైనల్లో అడుగు పెట్టి, ఒలంపిక్ బెర్త్ సాధించాడు. దీంతో ఒలంపిక్‌లో స్థానం పొందిన నాలుగో రెజ్లర్‌గా దీపక్ నిలిచాడు. అతనికన్నా ముందు వినేశ్ ఫోగట్, రవి కుమార్ దాహియా ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాలు సాధించి ఒలంపిక్ బెర్తు ఖాయం చేసుకున్నారు.


క్వార్టర్ ఫైనల్లో 86 కేజీల ప్రీైస్టెల్లో దీపక్ పూనియా 7-6 పాయింట్లతో కొలంబియాకు చెందిన కార్లోస్ ఆర్టురో మెండెజ్‌పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో మొదట 3-6తో వెనకబడ్డ దీపక్ తిరిగి పుంజుకొని 7-6తో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.



498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles