ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ టార్గెట్ 156

Sun,April 14, 2019 09:59 PM

Delhi end their innings on 155/7

హైదరాబాద్‌: ఉప్పల్‌ మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు చెలరేగిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఖలీల్‌ అహ్మద్‌(3/30), భువనేశ్వర్‌ కుమార్‌(2/33) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ఢిల్లీ త‌క్కువ‌ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ కోలిన్‌ మున్రో(40: 24 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), శ్రేయాస్‌ అయ్యర్‌(45: 40 బంతుల్లో 5ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(4), శిఖర్‌ ధావన్‌(7) మరోసారి ఘోరంగా విఫలమయ్యారు. రిషబ్‌ పంత్‌(23) పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. మున్రో కొంతసేపు దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో అతడు వెనుదిరగడంతో స్కోరు వేగం నెమ్మదించింది. ఒకానొక దశలో పటిష్ఠస్థితిలో ఉన్న ఢిల్లీ ఆఖర్లో అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయింది. మరోవైపు సన్‌రైజర్స్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు కూల్చారు.

1651
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles