ఆటను మెరుగు పర్చుకోవడానికి చాలా కష్టపడుతున్నా: పంత్

Wed,September 11, 2019 06:43 PM

Despite struggling to improve the game: Pant

న్యూఢిల్లీ: భారత్ త్వరలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టులు, టీ-20లు ఆడబోతోంది. ఇందుకు ఆటగాళ్లంతా సన్నద్దమవుతున్నారు. నెట్స్‌లో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ చాలా కష్టపడుతున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పంత్.. ప్రతిసారీ ధోనీతో పోల్చడం నాకు నచ్చడం లేదు. ఆయన ఆడే శైలి వేరు. నా శైలి వేరు. అతనొక దిగ్గజ ఆటగాడు. అతనితో నన్ను పోల్చడం సరైంది కాదు. నా శైలిలో నేనాడుతాను. అతడిని నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. అభిమానుల అంచనాలు అందుకోవడానికి నెట్స్‌లో చాలా ప్రాక్టీస్ చేస్తున్నా.

గత వెస్టిండీస్ సిరీస్‌లో మిగితా ఆటగాళ్లు బాగా రాణించారు. ఇక నన్ను నేను నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. ఈ సిరీస్‌లో పక్కాగా రాణిస్తానని నమ్మకముంది. స్వదేశంలో ఆడడం మా జట్టుకు అదనపు ప్రయోజనం. సొంత అభిమానుల మధ్య మాకు బలమెక్కువుంటుంది. దక్షిణాఫ్రికా జట్టు పటిష్టమైంది. వారి నుంచి గట్టి పోటీ ఎదుర్కోబోతున్నామని పంత్ అన్నాడు.

కాగా, ఇండియా, సౌతాఫ్రికా మొదటి టీ-20 ఈ నెల 15న మొదలవుతుంది. ఈ సిరీస్‌లో ఇండియా, సౌతాఫ్రికాతో 3 టీ-20లు, 3 టెస్టులు ఆడనుంది.

1172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles