రాణించిన ధావన్‌.. ఆసీస్‌ టార్గెట్‌ 256

Tue,January 14, 2020 05:33 PM

ముంబయి: ఆస్ట్రేలియాతో వాంఖెడే మైదానంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. 49.1 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన ఇండియా 255 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(91 బంతుల్లో 74: 9 ఫోర్లు, 1 సిక్స్‌), లోకేష్‌ రాహుల్‌(61 బంతుల్లో 47: 4 ఫోర్లు) మినహా మిగితా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. ఒకానొక దశలో 27 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 133 పరుగులతో పటిష్టంగా ఉన్న ఇండియా.. రాహుల్‌ ఔటవడంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఒక్కసారిగా తడబడింది. రెండో వికెట్‌కు వీరిద్దరూ శతక భాగస్వామ్యం నమోదు చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లి(16) 1 సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చాడు. తదుపరి బంతికే షాట్‌ ఆడబోయి బౌలర్‌ ఆడమ్‌ జంపాకే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. శ్రేయాస్‌ అయ్యర్‌(4 పరుగులు) విఫలమయ్యాడు. రిషభ్‌ పంత్‌(28), జడేజా(25) కాసేపు వికెట్లను అడ్డుకున్నారు. కానీ భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ 3 వికెట్లు, కమిన్స్‌ 2, రిచర్డ్‌సన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్‌ జంపా, ఆస్టన్‌ ఆగర్‌ చెరో వికెట్‌ తీశారు.1135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles