స‌హ‌నం కోల్పోయిన మిస్ట‌ర్ కూల్‌.. ధోనీకి జ‌రిమానా

Fri,April 12, 2019 11:03 AM

Dhoni fined 50 percent match fee after angry reaction to umpires call in ipl match

హైద‌రాబాద్‌: మిస్ట‌ర్ కూల్ ధోనీ త‌న స‌హ‌నాన్ని కోల్పోయాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో.. చెన్నై కెప్ట‌న్ ధోనీ .. ఆఖ‌రి ఓవ‌ర్‌లో ఆవేశానికి లోన‌య్యాడు. మైదానంలోకి వెళ్లి మ‌రీ ఫీల్డ్ అంపైర్ ఉల్‌హ‌స్ గాంధీతో వాగ్వాదానికి దిగాడు. దీంతో మ‌హీపై మ్యాచ్ ఫీజులో 50 శాతం జ‌రిమానా విధించారు. ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించినందుకు ధోనీపై జ‌రిమానా విధించిన‌ట్లు బీసీసీఐ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఐపీఎల్ నియ‌మావ‌ళినిలోని లెవ‌ల్ 2 శిక్ష కింద ధోనీకి జ‌రిమానా విధిస్తున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అయితే ఐపీఎల్ ఆడుతున్న ప్లేయ‌ర్ల‌కు జ‌రిమానా విధిస్తే, ఆ డ‌బ్బును ఆ జ‌ట్టు ఫ్రాంచైజీ క‌ట్టాల్సి ఉంటుంది.గురువారం జైపూర్‌లోని స‌వాయి మాన్ సింగ్ స్టేడియంలో రాజ‌స్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో ఉత్కంఠ‌ను రేపింది. 152 టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన చెన్నై.. చివ‌రి ఓవ‌ర్‌లో గెలుపు కోసం 18 ర‌న్స్ చేయాల్సి ఉంది. బెన్ స్టోక్స్ ఆ ఓవ‌ర్ వేశాడు. మొద‌టి బంతిని జ‌డేజా సిక్స‌ర్‌గా మ‌లిచాడు. రెండో బంతికి జ‌డేజా సింగిల్ తీశాడు. కానీ అంపైర్ ఆ బాల్‌ను నోబాల్‌గా ప్ర‌క‌టించాడు. అయితే స్ట్ర‌యికింగ్‌కు వ‌చ్చిన ధోనీ ఫ్రీట్ హిట్ బంతిని ఎదుర్కొన్నాడు. ఆ బంతికి ధోనీ రెండు ప‌రుగులు తీశాడు. ఆ త‌ర్వాత స్టోక్స్ వేసిన మూడ‌వ బంతికి ధోనీ క్లీన్‌బౌల్డ‌య్యాడు. దీంతో మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ స‌మ‌యంలో 3 బంతుల్లో 8 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది.

నాలుగవ బంతిని సాంట్న‌ర్ ఎదుర్కొన్నాడు. ఆ బంతికి 2 ర‌న్స్ తీశారు. కానీ ఫీల్డ్ అంపైర్ ఉల్‌హ‌స్ మొద‌టి నోబాల్‌గా ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత తన నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాడు. దీంతో గ్రౌండ్ బ‌య‌ట ఉన్న ధోనీ ఆగ్ర‌హంతో మైదానంలోకి వ‌చ్చాడు. ఫీల్డ్ అంపైర్ గాంధీతో వాగ్వాదానికి దిగాడు. చివ‌ర‌కు రెండు బంతుల్లో ఆరు ర‌న్స్ అవ‌స‌రం ఉంది. అయిద‌వ బంతికి సాంట్న‌ర్ రెండు ర‌న్స్ చేశాడు. ఇక చివ‌రి బంతికి 4 ర‌న్స్ కావాలి. అయితే స్టోక్స్ ఆర‌వ బంతిని వైడ్‌గా వేశాడు. దీంతో ఒక బంతికి 3 ర‌న్స్ కావాల్సి వ‌చ్చింది. మ్యాచ్ మ‌రింత ఉత్కంఠంగా మారింది. ఇక చివ‌రి బంతిని సాంట్న‌ర్ సిక్స‌ర్‌గా మలిచాడు. దీంతో చెన్నై ఉత్కంఠ రీతిలో విజ‌యాన్ని అందుకున్న‌ది.

3966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles