ధోనీ హీరో.. స్టీవ్ స్మిత్ విల‌న్‌!

Wed,April 26, 2017 11:13 AM

పుణె: ఐపీఎల్ ప‌దో సీజ‌న్‌లో ధోనీని కెప్టెన్సీ నుంచి త‌ప్పించి స్టీవ్ స్మిత్‌కు ఇచ్చిన త‌ర్వాత ప్ర‌తి ధోనీ అభిమాని ఇలాగే అనుకొని ఉంటారు. కానీ ఈసారి పుణె టీమ్ మెంబ‌రే ఈ మాట అంటున్నాడు. అత‌ని దృష్టిలో ధోనీ హీరో.. స్మిత్ విల‌న్ అట‌. ఆ మాట అన్న‌ది ఎవ‌రో కాదు పుణె టీమ్ మిలియ‌న్ డాల‌ర్ మ్యాన్ బెన్ స్టోక్స్‌. అయితే ఇది అత‌డు సీరియ‌స్‌గా అన్న విష‌యం కాదు. వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో విజ‌యాల త‌ర్వాత మంచి మూడ్‌లో ఉన్న ఆ టీమ్ ప్లేయ‌ర్స్‌.. కొన్ని లాక‌ర్ రూమ్స్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. ధోనీ, ర‌హానే, స్టోక్స్ ఈ ఫ‌న్నీ గేమ్‌లో పార్టిసిపేట్ చేశారు. ఇందులో భాగంగా కొన్ని చిలిపి ప్ర‌శ్న‌లకు క్రికెట‌ర్లు కూడా అంతే చిలిపిగా బ‌దులిచ్చారు. చివ‌ర్లో బాలీవుడ్‌లో చాన్స్ వ‌స్తే ఎవ‌రు హీరో, ఎవ‌రు విలన్‌గా ఉండాల‌న్న ప్ర‌శ్న‌కు స్టోక్స్‌.. హీరోగా ధోనీని, విల‌న్‌గా స్మిత్‌ను సెల‌క్ట్ చేశాడు. మొత్తానికి తెలిసీ తెలియ‌క ధోనీ అభిమానుల మ‌దిలో ఉన్న ఆప్ష‌న్స్‌నే స్టోక్స్ ఎంపిక చేయ‌డం విశేషం. ఆ ఫ‌న్నీ వీడియో మీరూ చూసి ఎంజాయ్ చేయండి.


1701
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles