బ్యాటింగ్ ఆపి బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేసిన ధోని..!

Wed,May 29, 2019 03:52 PM

Dhoni set fielding for bangladesh while he stopped batting

క్రికెట్ మైదానంలో ఎంత‌టి ఆవేశ‌పూరిత ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నా.. చాలా కూల్‌గా ఉండే ప్లేయ‌ర్.. ఎంఎస్ ధోని. ఆటలో త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ప్లేయ‌ర్లను కూడా ధోని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే నిన్న బంగ్లాదేశ్‌తో జ‌రిగిన ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ వార్మ‌ప్ మ్యాచ్‌లోనూ ధోని ఇటు టీమిండియా ఆట‌గాళ్ల‌నే కాదు, అటు బంగ్లాదేశ్ జ‌ట్టు స‌భ్యుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు.

కార్డిఫ్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన వార్మ‌ప్ మ్యాచ్‌లో భార‌త్ ఇన్నింగ్స్ 40వ ఓవ‌ర్‌లో బంగ్లాదేశ్ బౌల‌ర్ ష‌బ్బిర్ ర‌హ‌మాన్ బౌలింగ్ చేస్తుండ‌గా.. ధోని అత‌న్ని స‌డెన్‌గా ఆపి ఒక సారి ఫీల్డింగ్ చూసుకోమన్నాడు. మిడ్ వికెట్‌లో ఉన్న బంగ్లాదేశ్ ఫీల్డ‌ర్ అక్క‌డ ఉండ‌డం స‌రికాద‌ని, అత‌న్ని స్క్వేర్ లెగ్‌కు పంపాల‌ని ధోని చెప్పాడు. దీంతో బంగ్లా బౌల‌ర్ ర‌హ‌మాన్ అలాగే చేశాడు. ఈ క్ర‌మంలో ధోని ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు ఫీల్డింగ్ సూచ‌న‌లు చేయ‌డం వైర‌ల్‌గా మారింది. కాగా ఆ మ్యాచ్‌లో భార‌త్ 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 359 ప‌రుగులు చేయ‌గా ధోని 7 సిక్స‌ర్లు, 8 ఫోర్ల‌తో 113 ప‌రుగులు చేసి అద‌ర‌హో అనిపించాడు. ఇక బంగ్లాదేశ్ జ‌ట్టు 49.3 ఓవ‌ర్ల‌లో 264 ప‌రుగులు చేసి ఆలౌట్ అవ‌గా, భార‌త్ 95 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

12210
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles