బంతి స్టంప్స్‌కు తగిలినా.. ధోనీ బతికిపోయాడు.. వీడియో

Mon,April 1, 2019 12:39 PM

Dhoni survives even after Ball hits the Stumps Videos goes viral

చెన్నై: ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిందంటే.. దానికి కారణం ధోనీయే. కఠినమైన చెపాక్ పిచ్‌పై కేవలం 46 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు ధోనీ. అయితే నిజానికీ మ్యాచ్‌లో అతడు డకౌటయ్యే ప్రమాదం నుంచి బయటపడటమే విచిత్రమైన విషయం. 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనీ.. వెంటనే ఔటయ్యే వాడే. కానీ బంతి స్టంప్స్‌ను తగిలినా.. బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దీంతో బతికిపోయిన ధోనీ.. తర్వాత కుదురుకొని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో వికెట్ల వెనుకే ఉన్న స్టీవ్ స్మిత్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే ధోనీ ఎంత లక్కీయో మీకు తెలుస్తుంది. ఒకవేళ ఆ సమయంలో ధోనీ ఔటై ఉంటే.. చెన్నై పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. తలా ధోనీ ఎఫెక్ట్ చూశారా.. బంతి తగిలినా బెయిల్స్ కింద పడలేదు అంటూ ఐపీఎల్ ఈ వీడియోను పోస్ట్ చేసింది.


4744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles