ధోనీ రనౌట్ అయినప్పుడు ఆ ఫొటోగ్రాఫర్ నిజంగానే ఏడ్చాడా..?

Sat,July 13, 2019 02:17 PM

did the photographer really cried when dhoni got run out

సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రస్తుతం అనేక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజమా.. కాదా.. అని జనాలు సందేహించాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని అందులో నకిలీ వార్తలను ఎక్కువగా వ్యాప్తి చెందిస్తున్నారు. అవసరం ఉన్నా.. లేకపోయినా.. తప్పుడు వార్తలను సృష్టిస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తాజాగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ సెమీస్‌లో ధోనీ రనౌట్ అయిన విషయంపై ఓ ఫొటోగ్రాఫర్ ఏడూస్తూ ఫొటోలు తీస్తున్నాడనే వార్త కూడా బాగా వైరల్ అయింది. అయితే ఇంతకీ ఇది నిజమేనా..? ఆ ఫొటోగ్రాఫర్ నిజంగానే ధోనీ రనౌట్ చూసి ఏడ్చాడా..? అంటే.. కాదు.. అది పూర్తిగా అబద్ధం..!

ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఏఎఫ్‌సీ ఏషియన్ కప్ సాకర్ మ్యాచ్‌లో ఖతార్ జట్టు ఇరాక్‌పై 1-0 గోల్ తేడాతో గెలిచింది. అయితే ఆ మ్యాచ్‌లో ఇరాక్‌కు చెందిన స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ మహమ్మద్ అల్ అజ్జావీ తమ జట్టు ఓడిపోయినందుకు ఏడూస్తూ ఫొటోలు తీశాడు. అదీ.. అసలు విషయం.. కానీ కొందరు ఆ ఫొటోను ధోనీకి అంటగట్టారు. ధోనీ రనౌట్ అయినప్పుడు ఆ ఫొటోగ్రాఫర్ ఏడుస్తూ ఫొటోలు తీశాడని.. నకిలీ పోస్టులు పెట్టి ఆ ఫొటోలను వైరల్ చేశారు.. ఇదీ.. అసలు సంగతి..!

3256
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles