ఈ యొ-యొ టెస్ట్ ఏంది.. యువరాజ్ రావాల్సిందే!

Fri,November 10, 2017 05:25 PM

Do not know what is Yo Yo test but Yuvraj must come back to the team says Azharuddin

న్యూఢిల్లీ: యువీ ఫామ్‌లో ఉన్నా లేకపోయినా.. ఆడినా ఆడకపోయినా.. అతనికి కొందరు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా యువరాజ్ ఫ్యాన్స లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ యొ-యొ టెస్టులేంటో తనకు తెలియదుగానీ.. యువీ మాత్రం కచ్చితంగా ఇండియన్ టీమ్‌లోకి రావాల్సిందే అని అజర్ తేల్చి చెప్పాడు. ఈ యొ-యొ టెస్ట్ ఏంటో నాకు తెలియదు. కానీ ఫిట్‌నెస్ విషయానికి వస్తే మాత్రం అందరూ ఫిట్‌గా ఉండాల్సిందే. ఫిట్‌గా లేకపోతే ఆడకండి. కొందరు ప్లేయర్స్ తమ కెరీర్ చరమాంకంలో ఉన్నా ఇంకా చాలా బాగా ఉన్నారు. వాళ్ల కోసం ఫిట్‌నెస్ ప్రమాణాలను కాస్త తగ్గించాల్సిందే అని అజర్ అభిప్రాయపడ్డాడు.

దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ అజర్ ఈ కామెంట్స్ చేశాడు. 2011 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత యువరాజ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో అర్థం చేసుకొని, అతని కోసం ఈ ఫిట్‌నెస్ నిబంధనలను కాస్త సడలించాలని అజర్ అన్నాడు. మరో ప్లేయర్ సురేశ్ రైనా పేరును కూడా అజర్ ప్రస్తావించాడు. యువీ యొ-యొ టెస్ట్ పాస్ అవడం కష్టమే. ఇంకా కొందరు ప్లేయర్స్ కూడా ఉన్నారు. నేను వ్యక్తిగతంగా రైనాకు అభిమానిని. అతను కూడా టీమ్‌లోకి తిరిగి రావాలి. నెలన్నర కిందట అతన్ని కలిశాను. చాలా ఫిట్‌గా ఉన్నాడు. అయితే టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి అని అజర్ అన్నాడు.

5122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles