క్రికెటర్ యువరాజ్‌పై గృహ హింస కేసు

Wed,October 18, 2017 12:13 PM

Domestic Violence case filed against cricketer Yuvraj Singh

న్యూఢిల్లీ: క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహహింస చట్టం కింద కేసు నమోదు అయ్యింది. యువరాజ్ సోదరుడు జోరావార్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ ఈ కేసును ఫైల్ చేసింది. యువీతో పాటు అతని సోదరుడు జోరావార్, మాతృమూర్తి షబనమ్ సింగ్‌పైన కూడా గృహ హింస కేసును నమోదు చేశారు. ఈనెల 21వ తేదీన ఈ కేసు విచారణకు రానున్నది. బిగ్‌బాస్ కాంటెస్టాంట్ ఆకాంక్షా శర్మ తరపున వాదిస్తున్న స్వాతి సింగ్ మాలిక్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. యువీ తల్లి షబనమ్ కూడా ఆకాంక్షపై ఫిర్యాదు చేసిందని, ఆభరణాలు వెనక్కి ఇచ్చేయాలని ఆమె కేసు వేసినట్లు న్యాయవాది స్వాతి తెలిపారు. గృహ హింస అంటే కేవలం శరీరక హింస మాత్రమే కాదు అని, అది మానసిక, ఆర్థిక ఒత్తిడి కూడా అని లాయర్ తెలిపారు. తన క్లయింట్ ఆకాంక్ష వేదనకు గురి అవుతుంటే, క్రికెటర్ యువీ ఓ మౌన ప్రేక్షకుడిగా ఉండిపోయారని లాయర్ ఆరోపించారు. బిడ్డను కనాలంటూ ఆకాంక్షపై యువీ తల్లి షబనమ్ పదపదే ఒత్తిడి చేసిందని, యువీ కూడా అలాగే ఒత్తిడి చేశాడని, తల్లికి అండగా యువీ నిలిచాడని, ఆకాంక్ష అత్త షబనమ్ చాలా డామినెంట్‌గా వ్యవహరించినట్లు లాయర్ స్వాతి తెలిపారు.

12460
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles