హెయిర్‌ స్టయిలిస్టుగా మారిన బ్రావో

Tue,April 9, 2019 10:24 AM

Dwayne Bravo turns hairstylist for Chennai Super Kings teammate

హైదరాబాద్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్‌ డ్వెయిన్‌ బ్రావో అల్లరి తెలిసిందే. పాటలు పాడడం, డ్యాన్స్‌ చేయడం అతనికి సరదా. మైదానంలోనూ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ అతనెప్పుడూ ఎంటర్‌టేన్‌ చేస్తూనే ఉంటాడు. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ బ్రావో ఇప్పుడో కొత్త అవతారం ఎత్తాడు. తన టీమ్‌మేట్స్‌కు హెయిర్‌ స్టయిలిస్టుగా మారాడు. చెన్నై టీమ్‌ ప్లేయర్‌ మోనూ సింగ్‌కు బ్రావో హెయిర్‌ స్టయిలిస్టుగా మారాడు. ట్రిమ్మర్‌తో మోనూ సింగ్‌ తలవెంట్రుకలు కట్‌ చేశాడు. ఇవాళ చెన్నై, కోల్‌కత్తా మధ్య మ్యాచ్‌ జరగనున్నది.1102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles