స్టోక్స్ 14.5 కోట్లు.. మిల్స్ 12 కోట్లు

Mon,February 20, 2017 03:13 PM

బెంగళూరు: ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) వేలంలో ఇంగ్లండ్ ప్లేయ‌ర్స్ బెన్ స్టోక్స్‌, టైమ‌ల్ మిల్స్ జాక్‌పాట్ కొట్టారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఫ్రాంచైజీలు ఈ ఇద్ద‌రి కోసం తీవ్రంగా పోటీ ప‌డ్డారు. ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ కోసం హోరాహోరీ సాగుతుంద‌ని ముందే ఊహించినా.. మిల్స్‌ను రూ.12 కోట్ల‌కు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కొనుగోలు చేయ‌డ‌మే ఆశ్చ‌ర్యం క‌లిగించింది. స్టోక్స్ అయితే ఐపీఎల్ చ‌రిత్ర‌లో యువ‌రాజ్ (రూ.16 కోట్లు) త‌ర్వాత అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించ‌డం విశేషం. అత‌న్ని పుణె సూప‌ర్‌జెయింట్స్ కొనుగోలు చేసింది. చివ‌రి వ‌ర‌కు స్టోక్స్ కోసం ముంబై, ఢిల్లీ, స‌న్‌రైజ‌ర్స్‌, పుణె తీవ్రంగా పోటీ ప‌డ్డాయి. చివ‌రికి పుణె అత‌న్ని రూ.14.5 కోట్ల‌కు కొనుగోలు చేసింది.

ఇక కేవ‌లం 4 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టైమ‌ల్ మిల్స్ కోసం కూడా ఫ్రాంచైజీలు విప‌రీతంగా పోటీ ప‌డ‌టం విశేషం. అత‌ని కోసం ముంబై, పంజాబ్ మ‌ధ్య హోరాహోరీ సాగింది. చివ‌ర్లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కూడా పోటీ ప‌డింది. అయితే ప‌ది కోట్ల బిడ్ దాటిన త‌ర్వాత ఎంట‌రైన బెంగ‌ళూరు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ మిల్స్‌ను రూ.12 కోట్లు కొనుగోలు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడ‌ని మిల్స్ కోసం బెంగ‌ళూరు ఇంత ఖ‌ర్చు పెట్టడం ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

ఇక న్యూజిలాండ్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్‌, సౌతాఫ్రికా బౌల‌ర్ కాగిసో ర‌బాడాలు రూ.5 కోట్లు ప‌ల‌క‌గా.. ఆస్ట్రేలియా బౌల‌ర్ ప్యాట్ క‌మిన్స్ రూ.4.5 కోట్లకు అమ్ముడుపోయాడు. క‌మిన్స్‌, ర‌బాడాల‌ను ఢిల్లీ.. బౌల్ట్‌ను కోల్‌క‌తా కొనుగోలు చేశాయి.


ఐపీఎల్ వేలం పూర్తి వివరాలు
- వెస్టిండీస్ బ్యాట్స్ మన్ డారెన్ బ్రావోను కనీస ధర రూ.50 లక్షలకే కొనుగోలు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్
- వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామిని (రూ. 30 లక్షలు) కనీస ధరకే కొన్న కింగ్స్ పంజాబ్
- మునాఫ్ పటేల్ ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ లయన్స్
- హైదరాబాద్ మీడియం పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (కనీస ధర రూ.20 లక్షలు)ను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

- అమ్ముడుపోని సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (రూ. 50 లక్షలు)
- రెండో సెషన్ లోనూ ఇండియన్ బౌలర్ ఇషాంత్ శర్మ (కనీస ధర రూ.2 కోట్లు)పై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

- ఆస్ట్రేలియా బౌలర్ కౌల్టర్ నీల్ (కనీస ధర రూ.కోటి)ను రూ.3.5 కోట్లకు కొనుగోలు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్

- ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో (కనీసధర రూ.1.5 కోట్లు)ను కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు
- ఇండియన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ (రూ. 50 లక్షలు)ను రెండో సెషన్ లోనూ కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు
- ఇంగ్లండ్ డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ క్రిస్ జోర్డాన్ (రూ. 50 లక్షలు)ను కనీస ధరకే కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఇండియన్ ప్లేయర్ సౌరభ్ తివారీ (కనీస ధర రూ.30 లక్షలు)ను కనీస ధరకే కొన్న ముంబై ఇండియన్స్
- ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (కనీస ధర రూ. కోటి)ని కనీస ధరకే కొనుగోలు చేసిన గుజరాత్ లయన్స్
- న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (కనీస ధర రూ.50 లక్షలు)ను కనీస ధరకే కొనుగోలు చేసిన కింగ్స్ పంజాబ్
- తొలి సెషన్ లో అమ్ముడుపోని ఆటగాళ్ల వేలం
- లంచ్ తర్వాత మళ్లీ మొదలైన ఐపీఎల్ ఆటగాళ్ల వేలం
- ఐపీఎల్ వేలంలో లంచ్ బ్రేక్.. మధ్యాహ్నం రెండు గంటలకు మళ్లీ ప్రారంభం.. ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన క్రికెటర్ల జాబితా ఇదీ

- ఆరోన్ ను రూ. 2.8 కోట్లకు కొనుగోలు చేసిన కింగ్స్ పంజాబ్

- పేస్ బౌలర్ వరుణ్ ఆరోన్ (రూ. 30 లక్షలు) కోసం పంజాబ్, గుజరాత్ పోటాపోటీ
- ఇండియన్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్ (రూ. 30 లక్షలు)ను కనీస ధరకే కొన్న పుణె సూపర్ జెయింట్స్
- న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ (రూ. 50 లక్షలు)ను కనీస ధరకే కొనుగోలు చేసిన కింగ్స్ పంజాబ్
- అమ్ముడుపోని శ్రీలంక ఆల్ రౌండర్ థిసర పెరెరా (రూ. 50 లక్షలు)
- రిషి ధావన్ (రూ.30 లక్షలు)ను రూ.55 లక్షలకు కొనుగోలు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్
- ఇండియన్ స్పిన్నర్ కరణ్ శర్మ (రూ. 30 లక్షలు)ను రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

- ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ (కనీస ధర రూ.2 కోట్లు)ను రూ. 4.2 కోట్లకు కొన్న కోల్ కతా నైట్ రైడర్స్

- ఇండియా ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్ (రూ.30 లక్షలు)ను కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు
- వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ మార్లన్ శామ్యూల్స్ (కనీస ధర రూ. కోటి),డారెన్ బ్రేవో (రూ.50 లక్షలు) లపై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
- అమ్ముడుపోని అభినవ్ ముకుంద్, సుబ్రమణ్యం బద్రినాథ్
- అమ్ముడుపోని టీమిండియా బ్యాట్స్ మన్ చతేశ్వర్ పుజారా (రూ.50 లక్షలు)

- మనోజ్ తివారీ (రూ.50 లక్షలు)పై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
- స్పిన్నర్ ప్రవీణ్ థాంబె (రూ.10 లక్షలు)ను కనీస ధరకే కొనుగోలు చేసిన సన్ రైజర్స్
- రూ. 4 కోట్లకు రషీద్ ఖాన్ ను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (కనీస ధర రూ. 50 లక్షలు) కోసం ఫ్రాంచైజీల పోటీ

- స్పిన్నర్ ఎం అశ్విన్ (కనీస ధర రూ.10 లక్షలు)ను రూ. కోటికి కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్
- కేరళ మీడియం పేస్ బౌలర్ బాసిల్ థంపి (రూ.10 లక్షలు)ని రూ. 85 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ లయన్స్
- నాథు సింగ్ (రూ.30 లక్షలు)ను రూ. 50 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ లయన్స్
- తమిళనాడు పేస్ బౌలర్ టీ నటరాజన్ (కనీస ధర రూ.10 లక్షలు)ను రూ.3 కోట్లకు కొనుగోలు చేసిన కింగ్స్ పంజాబ్

- రాజస్థాన్ కు చెందిన మీడియం పేస్ బౌలర్ అనికేత్ చౌదరి (కనీస ధర రూ.10 లక్షలు)ని రూ. రెండు కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

- ఆదిత్య తారెను రూ.25 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్
- ఏకలవ్య ద్వివేదిని రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కర్ణాటకకు చెందిన ఆల్ రౌండర్ క్రిష్ణప్ప గౌతమ్ (కనీస ధర రూ.10 లక్షలు)ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

- ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్ మన్ మహ్మద్ నబీ (కనీస ధర రూ.30 లక్షలు)ను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

- తన్మయ్ అగర్వాల్ (రూ.10 లక్షలు)ను కనీస ధరకే కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఉన్ముక్త్ చంద్ (రూ.30 లక్షలు)ను కోనుగోలు చేయని ఫ్రాంచైజీలు
- అన్ క్యాప్డ్ ప్లేయర్స్ వేలం షురూ
- ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (కనీస ధర రూ.50 లక్షలు)ను కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు
- అమ్ముడుపోని ప్రజ్ఞాన్ ఓజా (కనీస ధర రూ.30 లక్షలు)
- అమ్ముడుపోని ఇండియన్ స్పిన్నర్ ఇషాన్ సోధి (కనీస ధర రూ.30 లక్షలు)
- అమ్ముడుపోని ఇషాంత్ శర్మ
- ఇండియన్ బౌలర్ ఇషాంత్ శర్మ (కనీస ధర రూ.2 కోట్లు)పై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

- ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ జాన్సన్ ను కనీస ధర రూ. 2 కోట్లకే కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
- ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్ (కనీస ధర రూ. 2 కోట్లు)ను రూ.4.5 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్

- మిల్స్ ను రూ.12 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- ఇంగ్లండ్ బౌలర్ టైమల్ మిల్స్ జాక్ పాట్

- రూ. 5 కోట్లకు ట్రెంట్ బౌల్ట్ ను కొనుగోలు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్

- న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కోసం ఫ్రాంచైజీల హోరాహోరీ
- రూ. 5 కోట్లకు కాగిసో రబాడాను కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్
- సౌతాఫ్రికా బౌలర్ కాగిసో రబాడా కోసం ఫ్రాంచైజీల పోటీ

- అమ్ముడుపోని ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో, శ్రీలంక కీపర్ దినేష్ చండీమాల్
- రెండో రౌండ్లో వికెట్ కీపర్ల కోసం మొదలైన వేలం
- ఐపీఎల్ చరిత్రలో యువరాజ్ సింగ్ (రూ.16 కోట్లు) తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ (రూ.14.5 కోట్లు) రికార్డు సృష్టించాడు.
- న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరె ఆండర్సన్ ను రూ. కోటికి కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్
- కనీస ధర రూ.2 కోట్లతో మొదలై రూ.14.5 కోట్లకు చేరిన స్టోక్స్ ధర

- ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను రూ.14.5 కోట్లకు కొన్న పుణె సూపర్ జెయింట్స్

- స్టోక్స్ కోసం పుణె, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై హోరాహోరీ
- స్టోక్స్ కోసం ఢిల్లీ, ముంబై మధ్య హోరాహోరీ
- ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కోసం పోటీ పడుతున్న ఫ్రాంచైజీలు
- ఇండియన్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (కనీస ధర రూ. 50 లక్షలు) ను కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు
- రూ.30 లక్షలు కనీస ధరగా ఉన్న ఇండియన్ ఆల్ రౌండర్ పవన్ నేగిని రూ.కోటికి కొనుగోలు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజిలో మాథ్యూస్ ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్
- ఇంగ్లండ్ టీ20, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన కింగ్స్ పంజాబ్. కనీస ధరకే అమ్ముడైన మోర్గాన్.

- తొలి రౌండ్లో అమ్ముడుపోని న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ మార్టిన్ గప్టిల్
- ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్, న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ లను కూడా కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు

2819
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles