IPL 2019: ఉప్ప‌ల్‌లో హైదరాబాద్ vs రాజస్థాన్

Fri,March 29, 2019 06:46 PM

Eyes on Williamson as Hyderabad Look For Win

హైదరాబాద్: భాగ్యనగరంలో ఐపీఎల్ సంద‌డికి వేళైంది. ఇవాళ రాత్రి 8 గంట‌ల‌కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ ఢీకొననుంది. కోల్‌కతాతో తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా.. ఆండ్రీ రస్సెల్ మెరుపులతో విజయానికి దూరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో పోరుకు స‌న్న‌ద్ధ‌మైంది. కోల్‌కతా చేతిలో సన్‌రైజర్స్‌.. పంజాబ్‌ చేతిలో రాజస్థాన్‌ ఓటములతో ఐపీఎల్‌-12ను ఆరంభించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సీజ‌న్‌లో బోణీ కొట్టాల‌ని ఇరుజ‌ట్లు పట్టుదలతో ఉన్నాయి. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన హైద‌రాబాద్‌ కెప్టెన్ విలియమ్సన్.. ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలున్నాయి.

అభిమానుల కోలాహ‌లం..

సొంత‌గ‌డ్డ‌పై తొలి మ్యాచ్ జ‌రుగుతున్నందున మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రికెట్ ఫ్యాన్స్ భారీగా త‌ర‌లివ‌చ్చారు. రెండు గంట‌ల ముందే స్టేడియానికి త‌ర‌లిరావ‌డంతో ప‌రిస‌రాల‌న్నీ కిక్కిరిసిపోయాయి. ఆరెంజ్ ఆర్మీకి మ‌ద్ద‌తు తెలిపి.. మైదానంలో వారిని ఉత్సాహ‌ప‌రిచేందుకు అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.



1467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles