కోహ్లిని ఎలా ఔటిస్తారు.. ఫ్యాన్స్ సీరియస్

Sun,December 16, 2018 03:42 PM

Fans furious over the way Virat Kohli given out

పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఔటైన తీరుపై దుమారం రేగుతున్నది. కమిన్స్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్ పట్టిన క్యాచ్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లి 123 పరుగుల దగ్గర ఉన్న సమయంలో స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చాడు. హ్యాండ్స్‌కాంబ్ తన కుడివైపుకు డైవ్ చేసి కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. అయితే బాల్ మాత్రం అప్పటికే గ్రౌండ్‌కు తగిలినట్లు రీప్లేల్లో కనిపించింది. అయినా మూడో అంపైర్ నిగెల్ లాంగ్ మాత్రం కోహ్లిని ఔటిచ్చాడు. దీంతో కోహ్లి కూడా షాక్ తిన్నాడు. విరాట్ ఔటవడంతో టీమ్ లోయర్ ఆర్డర్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన ఆధిక్యం ఆస్ట్రేలియాకు దక్కింది. దీంతో ఈ వివాదాస్పద నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఔటిచ్చిన అంపైర్‌తోపాటు క్యాచ్‌ను సరిగా అందుకోకపోయినా ఔట్ అంటూ వేలు చూపించిన ఫీల్డర్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్ తీరుపైనా మండిపడుతూ ట్వీట్లు చేశారు.


5227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles