గబ్బర్‌ గర్జన..

Tue,January 14, 2020 03:29 PM

ముంబయి: ఆస్ట్రేలియాతో వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తన బ్యాట్‌తో ఆసీస్‌ బౌలర్లపై గర్జిస్తున్నాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో తడబడింది. వైస్‌ కెప్టెన్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌.. జట్టు స్కోరు 13 పరుగులకే ఔటయ్యాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అనంతరం క్రీజులోకి వచ్చిన లోకేష్‌ రాహుల్‌తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆరంభంలో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్నా.. తర్వాత వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ప్రస్తుతం ధావన్‌ 70 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. అందులో 9 ఫోర్లు, 1 సిక్సర్‌ ఉన్నాయి. అతడికి రాహుల్‌(42 నాటౌట్‌) చక్కటి సహకారన్నిస్తున్నాడు. రెండో వికెట్‌కు ధావన్‌-రాహుల్‌ జోడీ 114 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పింది. కాగా, 26 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 129 పరుగులు చేసింది.

1123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles