మెన్ విల్ బి మెన్ అంటున్న గౌత‌మ్ గంభీర్‌

Tue,January 17, 2017 03:13 PM

Gautham Gambhir sees sexual bias in Dangal fame Zaira Wasim case

న్యూఢిల్లీ: ద‌ంగ‌ల్ ఫేమ్ జైరా వ‌సీమ్‌కు మ‌ద్ద‌తుగా నిలిచాడు క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్. ఈ చ‌ర్చ‌లో కొత్త‌గా లింగ భేదాన్ని తెర‌పైకి తెచ్చాడు. జైరా జ‌మ్ముక‌శ్మీర్ సీఎం మెహ‌బూబా ముఫ్తీని క‌ల‌వ‌డంపై విమ‌ర్శ‌లు గుప్పించిన వారిపై గౌతీ మండిప‌డ్డాడు. దంగ‌ల్‌లో న‌టించినందుకో.. మెహ‌బూబాను క‌లిసినందుకో జైరాను అన్ఇస్లామిక్ అని విమ‌ర్శించ‌డం దారుణ‌మ‌ని, ఆమె క్ష‌మాప‌ణ చెప్పాల్సి రావ‌డం విమ‌ర్శ‌కులు సిగ్గు ప‌డాల్సిన విష‌యం అని ట్వీట్ చేశాడు. జైరా ఎపిసోడ్ మొత్తం చూస్తే త‌న‌కు లింగ భేదం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అన్నాడు. ఇదే ఆమిర్‌ఖాన్‌, షారుక్‌ఖాన్ లేదా స‌ల్మాన్‌ఖాన్ చేసి ఉంటే ఇలాగే విమ‌ర్శించేవాళ్లా అని గంభీర్ ప్ర‌శ్నించాడు. జైరాలాంటి బాలిక‌ల ఎదుగ‌ద‌ల‌ను చూసి త‌ట్టుకోలేక‌పోతున్నారంటూ మెన్ విల్ బి మెన్ అని మ‌రో ట్వీట్ చేశాడు గంభీర్‌.


2151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles