అనామకుడికి ఆరు కోట్లు.. ఎవరీ క్రిష్ణప్ప?

Sun,January 28, 2018 04:40 PM

బెంగళూరుః ఐపీఎల్ వేలంలో అతని కనీసధర రూ.20 లక్షలు. కానీ అమ్ముడుపోయింది మాత్రం ఏకంగా రూ.6.2 కోట్లకు. అంటే కనీస ధర కంటే 31 రెట్లు ఎక్కువ ధర పలికాడు ఆ ప్లేయర్. అతనెవరో కాదు.. కర్ణాటక ఆల్‌రౌండర్ గౌతమ్ క్రిష్ణప్ప. రెండో రోజు వేలంలో ఆశ్చర్యం కలిగించిన బిడ్ ఇతనిదే. జయదేవ్ ఉనద్కట్ 11.5 కోట్లకు, ఆండూ టై 7.2 కోట్లకు అమ్ముడుపోయినా.. పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఓ అనామక ప్లేయర్‌గా వేలంలో అడుగుపెట్టిన క్రిష్ణప్ప ఏకంగా రూ.6.2 కోట్లకు అమ్ముడుపోవడం మాత్రం నిజంగా అనూహ్యమే. ఈసారి వేలంలో 12.5 కోట్లకు స్టోక్స్‌ను, 11.5 కోట్లకు ఉనద్కట్‌ను కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ టీమే.. ఈ క్రిష్ణప్పను కూడా సొంతం చేసుకోవడం విశేషం.


గతేడాది ఇదే క్రిష్ణప్పను ముంబై ఇండియన్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశమే రాలేదు. ఇప్పటి వరకు గౌతమ్ 27 టీ20లు ఆడి 16.31 సగటు, 159 ైస్ట్రెక్ రేట్‌తో 310 పరుగులు చేశాడు. ఇక 28.95 సగటుతో 20 వికెట్లు కూడా తీశాడు. ఈ మధ్యే రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్లో ముంబైపై 6 వికెట్లు తీసి కర్ణాటక సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.

3886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles