ధోనీ.. గ్లోవ్స్‌పై గుర్తు తొలగించొద్దు.. మేం ఐసీసీతో మాట్లాడుతున్నాం!

Fri,June 7, 2019 04:51 PM

Have requested for ICC approval MS Dhoni not to remove Balidan insignia says CoA chief Vinod Rai

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ కీపింగ్ చేస్తున్న సమయంలో వాడుతున్న గ్లోవ్స్‌పై ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ చిహ్నాన్ని తొలగించాల్సిన అవసరం లేదని, అది మిలటరీ చిహ్నం కాదని కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు. గ్లోవ్స్‌పై చిహ్నాన్ని కొనసాగించే విషయంపై ఐసీసీ నుంచి అనుమతి తీసుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ధోనీ గ్రీన్ కీపింగ్ గ్లోవ్స్‌పై ఉన్న బలిదాన్ గుర్తు వెలుగులోకి వచ్చింది.

ఈ సందర్భంగా రాయ్ మాట్లాడుతూ.. గుర్తు కొనసాగించే విషయంలో ఐసీసీ ఆమోదం కోరుతూ బీసీసీఐ ఇప్పటికే అధికారికంగా అభ్యర్థన చేసింది. ఐసీసీ నియమావళి ప్రకారం వాణిజ్య, మతం, ఆర్మీకి సంబంధించిన లోగోలను ఆటగాళ్లు వినియోగించకూడదు. ఈ అంశంలో(ధోనీ) ఎలాంటి వాణిజ్య, మతపరమైన చిహ్నాలు ఏమీ లేవు. అతని గ్లోవ్స్ మీదున్నది పారామిలటరీ రెజిమెంటర్ బాకు కాదని, కాబట్టి అతడు ఐసీసీ నియమావళిని ఉల్లంఘించలేదని రాయ్ పేర్కొన్నారు. గ్లోవ్స్‌పై చిహ్నాన్ని తీసివేయాలని మాత్రమే ఐసీసీ విజ్ఞప్తి చేసింది.. అది ఆదేశం కాదని ఆయన స్పష్టం చేశారు. ధోనీతో ఆ లోగోను తీయించాల్సిందిగా బీసీసీఐకి ఐసీసీ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో వినోద్ రాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ అక్కడికి చేరుకొని సీనియర్ ఐసీసీ అధికారులతో అతడు మాట్లాడుతాడని రాయ్ వివరించారు.

3795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles