భార్య ఓటమి..భర్త గెలుపు

Wed,November 6, 2019 01:31 PM

పుజౌ(చైనా): భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు ఊహించని షాక్. చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 9-21, 12-21తో లోకల్ ఫేవరెట్ క్రీడాకారిణి చై యన్ యన్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. పేలవ ఫామ్‌లో ఉన్న సైనా.. చైనా షట్లర్‌కు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న పోరు కేవలం 24 నిమిషాల్లోనే ముగిసింది.


మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సైనా భర్త, హైదరాబాదీ షట్లర్ పారుపల్లి కశ్యప్ టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఓపెనింగ్ రౌండ్‌లో వరుస గేముల్లో సత్తాచాటి శుభారంభం చేశాడు. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కశ్యప్ 21-14, 21-3తో సుతికోమ్ తమ్మాసిన్(థాయ్‌లాండ్)ను మట్టికరిపించాడు. 43 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనప్పటికీ రెండో గేమ్‌లో కశ్యప్ జోరు ముందు థాయ్ ఆటగాడు చేతులెత్తేశాడు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా, సిక్కిరెడ్డీ జోడీ ఓటమితో నిరాశపరిచింది. భారత్ జోడీ 14-21, 14-21తో చైనీస్ తైపీ ద్వయం వాంగ్ చీ లిన్, చెంగ్ చీ యా చేతిలో ఓడిపోయింది.3377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles