నాకు నేనుగా జట్టులో స్థానం సంపాదించుకున్నా: పంత్‌

Sat,September 7, 2019 06:21 PM

న్యూఢిల్లీ: స్వల్ప కాలంలోనే ఇండియా జట్టులో స్థానం సంపాదించిన ఆటగాడు రిషభ్‌ పంత్‌. దూకుడైన బ్యాటింగ్‌తో, చురుకైన కీపింగ్‌తో ఆనతి కాలంలోనే ఫేమస్‌ ఆటగాడయ్యాడు పంత్‌. వెస్టిండీస్‌ పర్యటన అనంతరం స్వదేశానికి వచ్చిన పంత్‌ మీడియాతో మాట్లాడాడు. విండీస్‌ పర్యటనలో ఒక్క అర్ధ సెంచరీ మినహా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విఫలమైన పంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. జట్టులో స్థానం కోసం చాలా కష్టపడ్డాను. ఐపీఎల్‌ సహా కీలక మ్యాచ్‌ల్లో రాణించాను. బాగా ఆడినపుడు పొగడడం, విఫలమైనపుడు విమర్శించడం క్రికెట్‌లో పరిపాటే.


జట్టులో చోటు నా ప్రదర్శన ఆధారంగా సాధించాను. ఎవరూ నన్ను పిలిచి జట్టులో స్థానం ఇవ్వలేదని భావోద్వేగంగా మాట్లాడాడు. కానీ, ప్రతీసారి ధోనీతో పోల్చడం నచ్చదు. అతని స్థాయి వేరు. అతడు సాధించిన ఘనతలు రికార్డులే చెబుతాయి. నేను అతడిని మార్గనిర్ధేశకుడిగా భావిస్తాను. అతని సలహాలు తీసుకుంటాను. నా బ్యాటింగ్‌ శైలి వేరు. అతని బ్యాటింగ్‌ శైలి వేరు. ఒకరితో పోల్చడం ఇష్టముండదు.

టెస్టులకు ధోని వీడ్కోలు పలికాక సాహా, దినేష్‌ కార్తీక్‌ టెస్టుల్లో కీపింగ్‌ భాద్యతలు నిర్వర్తించారు. 2017లో టెస్టుల్లోకి ఆరంగేట్రం చేసిన పంత్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల్లో సెంచరీలు సాధించాడు. తన బ్యాటింగ్‌, కీపింగ్‌తో సెలెక్టర్లను మెప్పించాడు. అన్ని ఫార్మాట్స్‌లో చోటు దక్కించుకున్నాడు. 2019 వరల్డ్‌కప్‌లో చోటు దక్కడం అదృష్టంగా భావించాను. ప్రపంచకప్‌లో ఆడడం ప్రతి క్రికెటర్‌ కల. కానీ, నాకు ధావన్‌ గాయపడడంతో చోటు దక్కింది. ఇది అస్సలు ఊహించని పరిణామం అయినా సంతోషంగా ఉంది అని పంత్‌ అన్నాడు.

1157
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles