అందుకే దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేశాం : విరాట్ కోహ్లీ

Wed,May 15, 2019 03:10 PM

హైద‌రాబాద్‌: వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు రెండ‌వ వికెట్ కీప‌ర్‌గా దినేశ్ కార్తీక్‌ను టీమిండియా యాజ‌మాన్యం ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. ఆ స్థానం కోసం రిష‌బ్ పంత్ నుంచి గ‌ట్టి పోటీ వ‌చ్చినా.. సెలెక్ట‌ర్లు మాత్రం దినేశ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. దీనిపై ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా రియాక్ట్ అయ్యాడు. దినేశ్ కార్తీక్ అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని అత‌న్ని ఎంపిక చేసిన‌ట్లు కోహ్లీ తెలిపాడు. క్లిష్ట‌ప‌రిస్థితుల్లో కార్తీక్ అనుభ‌వం, అత‌ని స‌హ‌నం .. వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉత్త‌మంగా నిలుస్తాయ‌ని కోహ్లీ అన్నారు. ఇంగ్లండ్‌లో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మాజీ కెప్టెన్ ధోనీయే వికెట్‌కీప‌ర్‌గా ఉంటాడు. ఒక‌వేళ ధోనీకి ఏదైనా అయితే అప్పుడు అత‌ని స్థానంలో దినేశ్ కీపింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. ఉత్కంఠ‌భ‌ర ప‌రిస్థితుల్లో దినేశ్ ఎటువంటి వ‌త్తిడి లేకుండా ఆడ‌గ‌ల‌డ‌ని కోహ్లీ అన్నారు. ఇదే విష‌యాన్ని బోర్డులోని ప్ర‌తి ఒక్క‌రూ అంగీక‌రించాన్నారు. దినేశ్‌కు అనుభ‌వం ఉంద‌ని, ధోనీకి ఏమైనా అయితే.. అప్పుడు దినేశ్ కీల‌కంగా మారుతాడ‌ని, ఒక ఫినిష‌ర్‌గా దీనేశ్ బాగా ఆడగ‌ల‌డ‌ని కోహ్లీ చెప్పాడు. భారీ టోర్న‌మెంట్‌కు అనుభ‌వం ముఖ్య‌మ‌ని, అందుకే అత‌న్ని ఎంపిక చేశామ‌న్నాడు. 2004లో కార్తీక్ వ‌న్డే అరంగేట్రం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాకు 91 వ‌న్డేలు ఆడాడు. 26 టెస్టులు కూడా ఆడాడ‌త‌ను.

4297
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles