సౌతాఫ్రికా ఢమాల్‌..విజయానికి 2 వికెట్ల దూరంలో కోహ్లీసేన

Sun,October 6, 2019 12:15 PM

విశాఖపట్నం: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత్‌ గెలుపు దిశగా సాగుతోంది. 395 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా ఐదో రోజు ఆదివారం లంచ్‌ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 117/8 స్కోరుతో నిలిచింది. దక్షిణాఫ్రికా విజయానికి 278 పరుగులు అవసరం కాగా.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో శుభారంభం చేయడానికి భారత్‌కు రెండు వికెట్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం పీట్‌(32), సెనురన్‌ ముత్తుస్వామి(19) క్రీజులో ఉన్నారు. ఆదివారం ఆటలో ఇంకా రెండు సెషన్ల ఆట ఉండటం.. ఇప్పటికే టాప్‌, మిడిలార్డర్‌ పెవిలియన్‌ చేరడంతో సిరీస్‌లో కోహ్లీసేన బోణీ చేయడం దాదాపుగా ఖరారైంది. టీమ్‌ఇండియా బౌలర్లు ధాటిగా బౌలింగ్‌ చేయడంతో బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. ఓవైపు జడేజా.. మరోవైపు షమీ విజృంభించడంతో టపటపా వికెట్లు పడ్డాయి. బావుమా(0)తో పాటు ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో సత్తాచాటిన డుప్లెసిస్‌(13), డికాక్‌(0)లను వరుసగా ఔట్‌ చేసి మ్యాచ్‌లో భారత్‌ పట్టుబిగించేలా చేశాడు. ఇప్పటి వరకు ఆటలో జడేజా నాలుగు, షమీ మూడు, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశారు.

1272
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles