ఐదు వికెట్లు కోల్పోయిన ఇండియా

Sun,September 22, 2019 08:20 PM

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టీ-20 మ్యాచ్‌లో ఇండియా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. 12.5 ఓవర్లలో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ఓపెనర్లు రోహిత్, ధావన్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. వీరిలో ధావన్(36) పర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాగిసో రబాడా 3 వికెట్లు పడగొట్టాడు. పాండ్యా బ్రదర్స్ క్రీజులో ఉన్నారు. వీరు ఏ మేరకు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తారో చూడాలి.

1324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles