అగ్రస్థానం టీమ్‌ఇండియాదే..

Mon,October 14, 2019 01:57 PM

పుణె: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. వెస్టిండీస్ టూర్‌తో ప్రారంభమైన విజయాల జోరు.. సొంతగడ్డపై కూడా అదే ఉత్సాహంతో దూసుకెళ్తోంది. కరీబియన్ గడ్డపై రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా 120 పాయింట్లు ఖాతాలో వేసుకోగా.. తాజా సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు నెగ్గి పాయింట్ల సంఖ్యను 200 కు పెంచుకుంది. ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ (60) కంటే భారత్ 140 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమైన టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో ఇప్పటిదాకా కోహ్లీసేన ఆడిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఏకంగా 200 పాయింట్లతో ‘టాప్‌’లో కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన టీమ్‌ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మరోవైపు వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లు ఆడిన రెండింటిలోనూ ఘోర పరాజయం పాలయ్యాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు ఇంకా ఒక్క టెస్ట్‌ కూడా ఆడలేదు.

1900
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles