పుణె టెస్ట్ మ్యాచ్ తొలిరోజు భారత్ 273/3

Thu,October 10, 2019 05:31 PM


హైదరాబాద్: పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ మూడు వికెట్ల నష్టానికి 273(85.1 ఓవర్లు) పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సెకండ్ టెస్ట్‌లో సైతం మయాంక్ అగర్వాల్ 108 పరుగులతో తన జోరును కొనసాగించాడు. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ 63 పరుగులు, అజింక్యా రహానే 18 పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడా మూడు వికెట్లు తీశాడు. భారత్ బ్యాట్స్‌మెన్లు మయాంక్ అగర్వాల్ 108 పరుగులు(195 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ శర్మ 14 పరుగులు(35 బంతులు, ఒక ఫోర్) ఛతేశ్వర పూజారా 58 పరుగులు(112 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) చేసి ఔటయ్యారు. విరాట్ కోహ్లీ 63 పరుగులు(105 బంతుల్లో 10 ఫోర్లు), అజింకా రాహానే 18 పరుగులతో( 70 బంతుల్లో మూడు ఫోర్లు) బ్యాటింగ్ బరిలో ఉన్నారు.

2021
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles