అఫ్గాన్‌తో టెస్టు.. పాండ్య మెరుపులు

Fri,June 15, 2018 10:55 AM

బెంగళూరు: అఫ్గానిస్థాన్, భారత్ మధ్య బెంగళూరు వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్‌నైట్ స్కోరు 347/6తో రవిచంద్రన్ అశ్విన్(7), హార్దిక్ పాండ్య(10) శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే అశ్విన్‌ను అహ్మద్‌జాయ్ పెవిలియన్ పంపాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో వైవిధ్యమైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 95 ఓవర్లు ఆడిన భారత్ 7 వికెట్లకు 407 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య(45), రవీంద్ర జడేజా(14) క్రీజులో ఉన్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ అఫ్గాన్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లోనే భారీ స్కోరు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని భారత్ ఆశిస్తోంది.

1801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles